అక్షరటుడే వెబ్‌డెస్క్: WhatsApp Guest Calling | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘గెస్ట్ కాలింగ్’ (Guest Calling) ఫీచర్. సాధారణంగా వాట్సాప్‌లో ఆడియో లేదా వీడియో కాల్ మాట్లాడాలంటే ఇరువైపులా అకౌంట్ ఉండటం తప్పనిసరి. అయితే ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ ఖాతా లేని వారు కూడా కేవలం ఒక లింక్ సహాయంతో గ్రూప్ కాల్స్‌లో సులభంగా జాయిన్ అవ్వవచ్చు. ఆఫీస్ మీటింగ్‌లు, ఆన్లైన్ క్లాసులు, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడటానికి ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది.
WhatsApp Guest Calling | అకౌంట్ లేకపోయినా ..
వాట్సాప్ అకౌంట్ ఉన్న వ్యక్తి ముందుగా ఒక ‘కాల్ లింక్’ క్రియేట్ చేసి ఇతరులకు షేర్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ అందుకున్న వారు తమ ఫోన్ లేదా కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా నేరుగా కాల్లోకి రావచ్చు. దీనివల్ల ప్రతీ ఒక్కరూ ప్రత్యేకంగా వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం లేదా ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు.
WhatsApp Guest Calling | ప్రైవసీ, భద్రతకు పెద్దపీట..
గెస్ట్ కాలింగ్ ఫీచర్లో కాల్ క్రియేట్ చేసిన హోస్ట్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. కాల్లో చేరాలనుకునే గెస్టులను అనుమతించడం (Approve) లేదా వారిని కాల్ నుంచి తొలగించే (Remove) అధికారం హోస్ట్‌కే ఉంటుంది. గెస్ట్లుగా వచ్చిన వారికి కాల్లో ఉన్న ఇతరుల ఫోన్ నంబర్లు కనిపించకుండా ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే గెస్ట్‌లు నేరుగా మెసేజ్‌లు పంపడం లేదా కొత్తవారిని కాల్లోకి ఆహ్వానించడం వంటి వాటిపై పరిమితులు ఉంటాయి. వాట్సాప్ ‘గెస్ట్ కాలింగ్’ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం.
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి, ‘కాల్స్’ (Calls) ట్యాబ్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపిచే ‘క్రియేట్ ఎ కాల్ లింక్’ (Create a Call Link) ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ఒక కొత్త లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్‌ను మీరు మాట్లాడాలనుకుంటున్న వారికి షేర్ చేస్తే సరిపోతుంది. లింక్ పొందిన వ్యక్తులు తమ వద్ద వాట్సాప్ అకౌంట్ లేకపోయినా, తమ ఫోన్ లేదా కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా నేరుగా ఆ కాల్లో జాయిన్ అవ్వవచ్చు.
WhatsApp Guest Calling | గూగుల్ మీట్, జూమ్‌లకు పోటీగా..
స్క్రీన్ షేరింగ్, ఎమోజీ రియాక్షన్స్ వంటి సదుపాయాలతో ఆన్లైన్ మీటింగ్‌లు నిర్వహించుకోవడానికి ఈ ఫీచర్ బాగా తోడ్పడుతుంది. గూగుల్ మీట్ ( Google Meet ) , జూమ్ వంటి యాప్‌లకు పోటీగా వాట్సాప్ ఈ గెస్ట్ కాలింగ్ ఫీచర్‌ను తీర్చిదిద్దుతోంది. ప్రత్యేకంగా వేరే యాప్‌లు ఇన్స్టాల్ చేసుకోకుండానే సులభంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
ఇది కూడా చదవండి: Kamareddy Traffic Problems | ట్రాఫిక్‌తో టెన్షన్..టెన్షన్.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో