అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oppo Find X10 Pro Max | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఒప్పో.. సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రొ ప్రాసెసర్ వినియోగించారు. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. భారీ బ్యాటరీ, 200 మెగా పిక్సెల్ కెమెరాలతో, అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు ఒప్పో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ప్రీ ఆర్డర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.78 ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1272 x 2772 పిక్సల్స్ రిజల్యూషన్, ఐపీ 66/68/69 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంది.
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రొ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ ఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
Oppo Find X10 Pro Max | కెమెరా సెటప్..
వెనకవైపు 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 200 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్, 200 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. దీనిలోని లూమో ట్రూ ఇమేజ్ ఇంజిన్ రంగుల పునరుత్పత్తి, టోన్‌లు మరియు ఇమేజ్ వివరాలను మెరుగుపరుస్తుందని కంపెనీ చెబుతోంది. వీటిలో రియర్ కెమెరాలపై 30 ఎఫ్పీఎస్ వద్ద 8కే వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
Oppo Find X10 Pro Max | బ్యాటరీ సామర్థ్యం..
8000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50డబ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Oppo Find X10 Pro Max | సింగిల్ వేరియంట్‌లో..
లూనా వైట్, టైటానియం గ్రే కలర్స్‌లో సింగిల్ వేరియంట్‌లో తీసుకువచ్చారు. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,99,999.
కార్డ్ ఆఫర్ : ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 20 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభించనుంది.
ఇది కూడా చదవండి..: Tonbo Imaging IPO | వీక్ మార్కెట్‌లోనూ అదరగొట్టిన ఐపీవో.. 66 శాతం లాభాలను అందించిన ‘టోన్బో’