Indian Stock Market | మళ్లీ బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

బేర్ దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 547 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | డాలర్ డిమాండ్‌ను అడ్డుకోవడానికి ఆర్బీఐ ఇటీవల తీసుకున్న చర్యలతో రూపాయి విలువ కాస్త బలపడిన్పటికీ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103 డాలర్ల శ్రేణిలో కొనసాగుతుండడం సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది.

అమెరికా బాండ్ ఈల్డ్స్ అధిక స్థాయిలలో ఉండడం, విదేశీ మదుపరుల నిరంతర నిధుల తరలింపు, గ్లోబల్, దేశీయ స్థూల ఆర్థిక ఆందోళనలతో ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన సూచీలు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ తదితర హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్ 12 పాయింట్లకుపైగా, నిఫ్టీ 350 పాయింట్ల వరకు పడిపోయాయి.

Indian Stock Market | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 299 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 113 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 1,208 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 58 పాయింట్లు పైకి ఎగబాకింది. లాభాల స్వీకరణతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 347 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 71,924 వద్ద, నిఫ్టీ 157 పాయింట్ల నష్టంతో 22,363 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,291 కంపెనీలు లాభపడగా 2,164 స్టాక్స్ నష్టపోయాయి. 281 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 148 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 183 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో, 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 1.38 శాతం, ఎం అండ్ ఎం 0.84 శాతం, కొటక్ బ్యాంక్ 0.66 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.47 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.28 శాతం పెరిగాయి.

Top Losers : ఐటీసీ 3.23 శాతం, టెక్ మహీంద్రా 3.10 శాతం, హెచ్యూఎల్ 2.10 శాతం, ఎల్టీ 1.87 శాతం, ఎస్బీఐ 1.78 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Toyota Glanza Facelift | లగ్జరీ హంగులతో టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న కొత్త ఫీచర్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *