Market Crash | మూడో రోజూ నష్టాలే.. రూ. 4.50 లక్షల కోట్ల సంపద ఆవిరి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Market Crash | పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడం, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండడం, ఐటీ సెక్టార్‌లో అమ్మకాల తీవ్రతతో ప్రధాన సూచీ ఒత్తిడికి గురవుతున్నాయి. దీనికితోడు రూపాయి బలహీనత, ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణతో దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకోలేకపోతోంది. దీనికి తోడు జేపీ మోర్గాన్ భారత స్టాక్ మార్కెట్ రేటింగ్‌ను ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్ కు తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నాయి.

Market Crash | 24 వేల దిగువకు నిఫ్టీ..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) వరుసగా మూడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిసింది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 181 నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 227 పాయింట్లు పెరిగింది. అయితే గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో 1,307 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 106 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. అక్కడినుంచి 393 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 982 పాయింట్ల నష్టంతో 766,681 వద్ద, నిఫ్టీ 275 పాయింట్ల నష్టంతో 23,897 వద్ద స్థిరపడ్డాయి.

Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,326 కంపెనీలు లాభపడగా 2,905 స్టాక్స్ నష్టపోయాయి. 158 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 138 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 39 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 4.50 లక్షల కోట్ల మేర తగ్గింది.

Market Crash | అన్ని రంగాల్లో అమ్మకాలు..

దేశీయ స్టాక్ మార్కెట్ లో అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 5.29 శాతం, ఫార్మా 1.77 శాతం, టెలికాం 1.55 శాతం, మీడియా 1.87 శాతం, రియాలిటీ ఇండెక్స్‌లు 1.35 శాతం, టెలికాం 1.34 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.01 శాతం నష్టపోయాయి.
Gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 5 స్టాక్స్ లాభపడగా.. 25 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 0.73 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.42 శాతం, ఎస్‌బీఐ 0.36 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 0.13 శాతం, కొటక్ బ్యాంక్ 0.03 శాతం లాభపడ్డాయి.

Top losers : ఇన్ఫోసిస్ 7.05 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.83 శాతం, టీసీఎస్ 4.77 శాతం, టెక్ మహీంద్రా 4.04 శాతం, సన్‌ఫార్మా 3.65 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Oppo F33 | ఒప్పో నుంచి మరో క్రేజీ ఫోన్..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *