Amit Shah | దీదీకి రాష్ట్రంలోనే చోటు లేదు.. ఇక ఢిల్లీకి ఎలా వస్తారు?: అమిత్ షా

Balla Sandeep Kumar

అక్షరటుడే,  కోల్‌కతా : Amit Shah | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ రాజకీయ వేడి పీక్స్‌కు చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్‌లో ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలోని మాఫియా, గూండా రాజ్యానికి ప్రజలే చరమగీతం పాడుతారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Amit Shah | ఢిల్లీకి ఎలా వస్తారు?:

బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలోనూ చక్రం తిప్పుతానన్న మమతా బెనర్జీ (Mamata Banerjee)  వ్యాఖ్యలపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోతున్న మమత.. ఇక ఢిల్లీకి ఎలా వస్తారు?” అని ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేస్తూ, దీదీకి బెంగాల్‌లోనే ఏమీ మిగలదని స్పష్టం చేశారు.

Amit Shah | మమత సంచలన వ్యాఖ్యలు:

అంతకుముందు పోలింగ్ సమయంలో మమతా బెనర్జీ బీజేపీ (BJP)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌ గెలుపు తర్వాత ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని మమత ప్రకటించారు.

తగిన బుద్ధి చెబుతానని:టీఎంసీలో ఉంటూ బీజేపీకి సహకరిస్తున్న వారి పేర్లన్నీ తన వద్ద ఉన్నాయని, వారందరికీ తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. కేంద్రం తన దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో హద్దులు దాటుతోందని, ఎన్నికల సంఘం కూడా బీజేపీ కనుసన్నల్లోనే పని చేస్తోందని ఆమె ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: Election Commissioner Removal | ఎన్నికల కమిషనర్​ను తొలగించాలని రాజ్యసభలో విపక్షాల నోటీస్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *