Siddaramaiah Resignation | మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా : సిద్దరామయ్య

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Siddaramaiah Resignation | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేడు రాజీనామా చేయనున్న విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. తాను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు. నాకు ఎలాంటి బాధ లేదు.. మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు.. హైకమాండ్‌ నన్ను సీఎం పదవికి రాజీనామా చేయమని కోరిందని సిద్దరామయ్య తెలిపారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్వహించిన బ్రేక్​ఫాస్ట్​ మీటింగ్​ (Breakfast Meeting)కు డీకే శివ కుమార్ గురువారం ఉదయం హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆయన తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు మధ్యాహ్నం ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో డీకే శివకుమార్​ (DK Shivakumar) సీఎం పదవి చేపట్టనున్నట్లు సమాచారం. మధ్యాహ్న భోజనం తర్వాత తాను తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రులకు తెలియజేశారని వర్గాలు తెలిపాయి. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బెంగళూరుకు దూరంగా ఉన్నప్పటికీ, రాజీనామా ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. ఇవాళ సీఎంగా సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని మంత్రి పరమేశ్వర సైతం తెలిపారు.

siddaramaiah

Siddaramaiah Resignation | శివకుమార్​ ఇంటి వద్ద భారీ భద్రత

మంత్రులతో సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు సిద్దరామయ్య (Siddaramaiah Resignation ) తెలిపారు. అయితే తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. అయితే డీకే శివకుమార్​ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు చర్చ సాగుతోంది. ఈ మేరకు ఆయన నివాసం వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, పోలీసుల మోహరించారు. మరోవైపు బెంగళూరులోని మేఖ్రి సర్కిల్ వద్ద కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, KPCC అధ్యక్షుడు డీకే శివకుమార్ చిత్రంతో కూడిన ఒక పోస్టర్ వెలిసింది.

దీనిని కూడా చదవండి : Supreme Court Judges | సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *