NEET Exam Scam | నీట్​ పరీక్షలో భారీ మోసాలు : కేరళం మాజీ సీఎం విజయన్​

నీట్​ పరీక్షలో భారీ స్థాయిలో మోసాలు జరిగాయని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam Scam | నీట్​ పరీక్షలో భారీ స్థాయిలో మోసాలు జరిగాయని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan)​ ఆరోపించారు. పేపర్​ లీకేజీపై కఠిన చర్యలు తీసుకోవాని డిమాండ్​ చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తిరువనంతపురంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళం (Keralam) దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే ఒక ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్మించిందన్నారు. ఇప్పుడు ఆ పురోగతిని వెనక్కి మళ్లించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

NEET Exam Scam | ఎస్​ఎఫ్​ఐ చురుకైన పాత్ర

ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి, యువజన ఆందోళనల్లో SFI చురుకైన పాత్ర పోషిస్తోందని విజయన్​ అన్నారు. నీట్ 25 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే పరీక్ష అని తెలిపారు. ఈ పరీక్ష కుంభకోణం వెనుక ఒక మాఫియా ఉందని ఆరోపించార. ఏదో కారణం చేత, ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న నేరస్తుల పేర్లు, వివరాలను బహిర్గతం చేయడం లేదన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసుల లాఠీచార్జీని ఆయన ఖండించారు.

NEET Exam Scam | కాంగ్రెస్​ ఎక్కడ..

నీట్​ పరీక్ష విషయంలో జరుగుతున్న ఆందోళనలలో కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎక్కడా కనిపించడం లేదని పినరయి విజయన్​ విమర్శించారు. NSUI ఎందుకు ఈ నిరసనలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఇంతకాలం కాంగ్రెస్ ఈ ఆందోళనకు దూరంగా ఉండటం తప్పే అయినప్పటికీ, చివరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో నిరసన తెలిపేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు.

 

దీనిని కూడా చదవండి : Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *