అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amaravati BITS | రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)తో సమావేశమై ప్రాజెక్ట్ పురోగతిని వివరించారు.
2027 నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు.అమరావతి (Amaravati)లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌ను ఆధునిక సాంకేతికతలతో కూడిన ‘ఐకానిక్, ఏఐ క్యాంపస్’గా తీర్చిదిద్దుతున్నామని ప్రతినిధులు తెలిపారు. క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు వంటి భవిష్యత్ ఆధారిత కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.
Amaravati BITS | స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ఈ రంగాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాంపస్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటం టెక్నాలజీ (Quantum Technology) రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. యువతకు నూతన అవకాశాలు కల్పించడంలో ఈ క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. బిట్స్ పిలానీ అమరావతి క్యాంపస్‌ను మూడు దశల్లో నిర్మిస్తున్నట్లు ప్రతినిధులు వివరించారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత ఈ క్యాంపస్‌లో సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించే అవకాశముందని తెలిపారు.
Amaravati BITS | ఆధునిక సాంకేతిక విద్యతో
క్యాంపస్ నిర్మాణం మరియు సంస్థ విస్తరణకు మొత్తం రూ.250 కోట్ల వ్యయం చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అమరావతిని విద్యా, సాంకేతిక రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక విద్యతో యువతకు నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ క్యాంపస్ కీలక కేంద్రంగా మారనుంది.
ఇది కూడా చదవండి..: Ananthababu Arrest | వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..

