KA Paul Counter | పవన్​ కల్యాణ్​కు కేఏ పాల్ కౌంటర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KA Paul Counter | ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ (Pawan Kalyan)​కు కేఏ పాల్​ కౌంటర్​ ఇచ్చారు. తమ్ముడూ పవన్ కళ్యాణ్ ఎందుకీ గొడవలు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు.

పవన్​ ఇటీవల తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆయన సభకు అనుమతి ఇవ్వకపోవడంతో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అన్నారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్​, బీఆర్​ఎస్ (BRS)​ నేతలు కౌంటర్​ ఇచ్చారు. పవన్​ వ్యాఖ్యలతో సోషల్​ మీడియాలో సైతం పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతోంది. ఆయన మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు.

KA Paul Counter | హామీలు అమలు చేయాలి

కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రజలు నిలదీస్తుంటే, అవి మానేసి ఎందుకు ఈ గొడవలన్నీ ఎందుకని కేఏ పాల్ అన్నారు. జూన్‌ 14న నేను హ్యూస్టన్‌లో పెద్ద సభ పెట్టబోతున్నానని ఆయన తెలిపారు. ఆ సభకు రమ్మంటూ పవన్‌ను ఆహ్వానించారు.

 

దీనిని కూడా చదవండి : Grain Procurement Dispute | ధాన్యం కొనుగోళ్లు చేతగాక.. కేంద్రంపై విమర్శలు : ఎంపీ అర్వింద్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *