Grain Procurement Dispute | ధాన్యం కొనుగోళ్లు చేతగాక.. కేంద్రంపై విమర్శలు : ఎంపీ అర్వింద్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Grain Procurement Dispute | ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం (BJP Office)లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో 142 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఇస్తామని ఎఫ్​సీఐతో ఒప్పందం చేసుకుందన్నారు. కానీ ఇప్పటి వరకు 106 లక్షల మెట్రిక్​ టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే ఎఫ్​సీఐకీ బాకీ ఉందన్నారు. రైతుల మీద రాజకీయాలు చేయడానికి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి సిగ్గు ఉండాలని విమర్శించారు. ఆయనకు కొనుగోళ్లు చేతకాక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Grain Procurement Dispute | పూర్తిగా విఫలం

Grain Procurement Dispute

ధాన్యం కోతలు ప్రారంభం అయ్యే సమయానికి సెంటర్లు రెడీ ఉండాలన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని పేర్కొన్నారు. జూన్​ వరకు కొనుగోళ్లు పూర్తి కాలేదని విమర్శించారు. ఎండల తీవ్రతకు నూకల శాతం పెరుగుతుందన్నారు. అక్రమ ఇసుక, మొరం రవాణా కోసం లారీల కొరత లేదని, రైతుల ధాన్యం తరలించడానికి మాత్రం లారీలు లేవన్నారు. రైతులపై ప్రభుత్వం చిన్న చిపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Grain Procurement Dispute | రాజీనామా చేయాలి

Grain Procurement Dispute

సీఎంకు చేతకాకపోతే రాజీనామా చేయాలని అర్వింద్​ (MP A rvind) డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్​రెడ్డి ఒక్కరోజైనా జై తెలంగాణ అనలేదన్నారు. కోటీ మంది మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారని అర్వింద్​ ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎవరో రాసిచ్చిన స్పీచ్​ను ముఖ్యమంత్రి చదివారన్నారు. అందులో అన్ని అబద్దాలే ఉన్నాయని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Deputy Collectors Transfers | పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *