Mohali Office Murder | పంజాబ్‌లో ఘోరం.. ప్రియురాలిని ఆఫీసులోనే పొడిచి చంపిన ప్రేమోన్మాది

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mohali Office Murder | పంజాబ్‌లో ఒక భయంకరమైన ఉదంతం వెలుగుచూసింది. ఆఫీసులో తోటి ఉద్యోగులందరూ చూస్తుండగానే.. ఓ ప్రేమోన్మాది తన మాజీ ప్రియురాలిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.

Mohali Office Murder | పోలీసుల కథనం ప్రకారం..

పటియాలాకు చెందిన డింపుల్ (30) అనే మహిళ మోహాలీలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే ఆఫీస్‌లో పనిచేసే హర్జిందర్ సింగ్ (39) అనే వ్యక్తితో ఆమె గత మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల వీరిద్దరూ విడిపోయారు. బ్రేకప్‌ను తట్టుకోలేకపోయిన హర్జిందర్.. మళ్లీ తనతో కలవాలంటూ డింపుల్‌పై నిరంతరం ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

panjab

Mohali Office Murder | సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..

గురువారం సాయంత్రం తీవ్ర ఆవేశంతో ఆఫీసులోకి ప్రవేశించిన హర్జిందర్.. నేరుగా డింపుల్ వద్దకు వెళ్లి కత్తితో దాడి చేసాడు. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తినప్పటికీ, వదలకుండా వెంబడించి దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు. అక్కడున్న తోటి సిబ్బంది నిందితుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. డింపుల్ కుప్పకూలిపోయిన తర్వాత, నిందితుడు అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలన్నీ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

panjab.2

Mohali Office Murder | నిందితుడి పరిస్థితి విషమం..

ఈ ఘాతుకంతో ఆఫీసులోని ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే డింపుల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన హర్జిందర్ సింగ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి:  Wipro Religious Harassment | మతమార్పిడి రగడ..‘వేధింపులు సహించం’ అంటూ విప్రో వార్నింగ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *