అక్షరటుడే, వెబ్డెస్క్ : Singareni Workers Issues | అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు మైన్ను టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సందర్శించారు. కార్మికులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఒక కార్మికుడు తాను పడుతున్న ఇబ్బందులు చెప్తుంటే విని చలించి పోయిన కవిత.. కార్మికుడి బాధలు విని కంటతడి పెట్టుకున్నారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సింగరేణికి ప్రభుత్వమే విద్రోహిగా తయారైంది కవిత విమర్శించారు. 50 వేల కోట్లు బకాయి పెట్టటంతో సంస్థ ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని ఆరోపించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని మండిపడ్డారు. హెచ్ఎంఎస్ ను గెలిపించండి. మీరు కాలర్ ఎగిరేసుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి అత్యధిక రెవెన్యూతో ఉత్తర తెలంగాణకు అన్నం పెడుతోందన్నారు. అలాంటి సంస్థకు చెందిన కార్మికుల మద్దతు కావాలని వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానని కవిత తెలిపారు.
Singareni Workers Issues | లేబర్ చట్టాల గురించి..
ఇప్పుడు సింగరేణిలో చాలా మంది చదువుకున్న యువత పనిచేస్తోందని కవిత పేర్ఓకొన్నారు. వాళ్లంతా కూడా లేబర్ చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. దాని ద్వారా మన హక్కులను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా సింగరేణలో బ్రిటీష్ సిస్టం నడుస్తోందని ఆరోపించారు. కార్మికులను ఆఫీసర్లు ఇబ్బంది పెడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Telangana Student Missing | ఫిన్లాండ్లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం