అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Kavitha Nizamabad Visit | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇందూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు.
Kavitha Nizamabad Visit | ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ..
మాధవనగర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కవిత గతంలో పేర్కొన్నారు. ‘పాంచజన్యం’ పేరుతో ఐదు పథకాలను ఆమె ఇందూరు వేదికగా ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Police Promotions | పలువురు హెడ్‌కానిస్టేబుళ్లకు పదోన్నతులు.. అభినందించిన సీపీ