అక్షరటుడే వెబ్‌డెస్క్: Akshaya Thanga Maligai | ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యూవెలర్స్ తన తొలి ప్రాంతీయ జ్యువెలరీ బ్రాండ్ అయిన ‘అక్షయ తంగ మాలిగై’ (ATM) పేరును, లోగోను అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు మార్కెట్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చారు.
చెన్నైలోని ప్రసిద్ధ వ్యాపార కేంద్రమైన టి.నగర్ (పనగల్ పార్క్ సమీపంలో) ఆగస్టు 21న ఈ ఏటీఎం బ్రాండ్ తొలి షోరూమ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలోనే తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 5 స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Akshaya Thanga Maligai | బ్రాండ్ అంబాసిడర్‌గా శివకార్తికేయన్..
స్థానిక సంప్రదాయాలు, నమ్మకానికి ప్రాధాన్యతనిచ్చే ఈ మాస్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఇప్పటికే దీనికి సంబంధించి మార్కెట్‌లో ప్రచార కార్యక్రమాలు (టీజర్ క్యాంపెయిన్) మొదలయ్యాయి.
Akshaya Thanga Maligai | ప్రత్యేకతలు ఇవే.
తమిళనాడు ప్రజల అభిరుచులు, పండగలు, కొనుగోలు విధానాలకు తగినట్లుగా ఈ ఆభరణాలను రూపకల్పన చేశారు. ఇవి తక్కువ బరువుతో పాటు అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరల్లో లభిస్తాయి. రాష్ట్రంలోని స్థానిక పాత జ్యువెలరీ బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా, అదే సమయంలో కళ్యాణ్ జ్యూవెలర్స్ సొంత స్టోర్లకు ఎలాంటి ప్రభావం పడకుండా ఈ ఏటీఎం బ్రాండ్‌ను తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ జ్యూవెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ.. స్థానిక శైలిని పాటిస్తూ ముందుకు వెళ్తే ప్రాంతీయ మార్కెట్లలో గొప్ప వృద్ధి సాధించవచ్చని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద తమిళనాడు జ్యువెలరీ మార్కెట్‌తో తమ తొలి ప్రాంతీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని, భవిష్యత్తులో ఇతర ప్రాంతీయ మార్కెట్లలోనూ ఈ విధానాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Microsoft Market Value | చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్.. ఒక్కరోజే రూ. 42 లక్షల కోట్లు పెరిగిన సంపద..