CID Inspector Retirement | సీఐడీ ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు పదవీ విరమణ.. 42 ఏళ్ల సుదీర్ఘ సేవలకు అధికారుల సత్కారం

నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో సేవలు అందించిన ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు శుక్రవారం పదవీవిరమణ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CID Inspector Retirement | నేర పరిశోధన విభాగం (సీఐడీ) లో సేవలు అందించిన ఇన్​స్పెక్టర్​ ఆంజనేయులు (CID Inspector Anjaneyulu) శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

CID Inspector Retirement | పోలీస్​శాఖలో మచ్చలేని సేవలు..

ఈ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో సీఐడీ డీఐజీ పరిమళ హనా నూతన్, హైదరాబాద్ సీఐడీ ఎస్పీ డాక్టర్ నవీన్ కుమార్ (IPS), సీఐడీ అడ్మిన్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ​విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థత, సుదీర్ఘ అనుభవంతో పోలీస్ శాఖలో ఆంజనేయులు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. 42ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిష్కళంకంగా సేవలందించడం కత్తి మీద సాములాంటిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులును అధికారులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి, ఆయన విశిష్ట సేవలను అభినందించారు.

CID Inspector Retirement | నిజామాబాద్​ జిల్లాలోనూ విశిష్ట సేవలు..

ఆంజనేయులు విధి నిర్వహణలో భాగంగా నిజామాబాద్ (Nizamabad)​ జిల్లాలోనూ సేవలందించారు. జిల్లాలో పనిచేసిన సమయంలో ఆయన ఆయా పోలీస్​స్టేషన్లలో సీఐగా పనిచేశారు. అనంతరం సీఐడీ విభాగంలోనూ పని చేసి నిక్కచ్చిగా ఉండే అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

పలు క్రిమినల్​, ఆర్థిక నేరాలకు సంబంధించిన పరిశోధనల్లో చురుగ్గా పాల్గొని సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. అనంతరం హైదరాబాద్​లోని సీఐడీ కార్యాలయానికి బదిలీపై వెళ్లిన ఆయన అక్కడే పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్​ జిల్లాలోని అధికారులు సైతం ఆంజనేయులుకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

CID Inspector Retirement | సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు..

పదవీ విరమణ వేడుకలో ఆంజనేయులు మాట్లాడుతూ.. పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ​తన 42 ఏళ్ల సర్వీసులో ప్రజలకు, శాఖకు అంకితభావంతో సేవలు అందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో సీఐడీ కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

454

ఇది కూడా చదవండి: పెరుగుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *