అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TNGOs Felicitation | జిల్లాకు బదిలీపైవచ్చిన ఉన్నతాధికారులను టీఎన్జీవోస్ (TNGOs Nizamabad ) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఘనంగా సన్మానించారు.
TNGOs Felicitation | అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), డీఆర్వో..
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు, రెవెన్యూ అధికారిణి బి. గీత (DRO Geetha) జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చారు. వారిని కలెక్టరేట్లోని కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్ బృందంతో కలిసి సన్మానించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై (Government Employees) వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, రూరల్ యూనిట్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, స్వామి, సాయికృష్ణ, విజయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Drinking Water Waste | తాగునీరు వృథా.. రూ.10 వేలు ఫైన్ వేసిన అధికారులు