అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bengal Election Results | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల (bengal election results) ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ అధికార టీఎంసీ(TMC), బీజేపీ(BJP) మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు జరిగింది. అయితే ఫలితాల్లో ప్రస్తుతం మమత బెనర్జీక్ షాక్ ఇస్తూ.. బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Bengal Election Results | బెంగాల్లో 293 స్థానాలు..
బెంగాల్లో(Bengal) 293 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. 148 స్థానాల్లో గెలిస్తే అధికారాన్ని దక్కించుకోవచ్చు. ఇక్కడ కమలం పార్టీ ప్రస్తుతం 134 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. టీఎంసీ 111 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రెండింటి మధ్య అంతరం తక్కువగా ఉండటంతో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. మరోవైపు కాంగ్రెస్ 3, ఇతరులు 4 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్‌లకు కంచుకోటగా ఉన్న బెంగాల్లో ప్రస్తుతం ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా లీడ్‌లో లేదు.
Bengal Election Results | మమత వెనుకంజ
ముఖ్యమంత్రి మమత బెనర్జీ(mamata banerjee) నందిగ్రామ్, భవానిపూర్‌లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చోట్ల ఆమె ప్రతిపక్ష నాయకుడు సువేంద్ అధికారి(suvendu adhikari) పోటీ చేశారు. నందిగ్రామ్‌లో సువేంద్ లీడ్‌లో ఉండగా.. మమత బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో సైతం మమతను ఆయన ఓడించిన విషయం తెలిసిందే. భవానిపూర్‌లో సైతం ఇప్పటి వరకు సువేంద్ లీడ్‌లో ఉండగా.. తాజాగా మమత ఆధిక్యంలోకి వచ్చారు.
ఇది కూడా చదవండి: Kerala Election Results | కేరళంలో సంచలనం.. అధికార మార్పు దిశగా ఫలితాలు

