AI Humanoid Robots | ఏఐ మాయాజాలం: మార్కెట్ వ్యాపారుల తలపై కెమెరాలు.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: AI Humanoid Robots | ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) యుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ప్రముఖ కేఆర్ మార్కెట్ (KR Market) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎప్పుడూ పూలు, కూరగాయల వ్యాపారాలు, కొనుగోలుదారులతో సందడిగా ఉండే ఈ మార్కెట్‌లో తాజాగా ఓ వింత దృశ్యం కనిపించింది. కొందరు వ్యాపారులు తమ తలపై ప్రత్యేక కెమెరాలను ధరించి యథావిధిగా రోజువారీ పనులు చేసుకుంటూ కూరగాయలు, పూలు అమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

AI Humanoid Robots | నెటిజన్ల రకరకాల కామెంట్లు..

వ్యాపారులు ధరించిన ఆ ప్రత్యేక కెమెరాలు వారి కదలికలు, వస్తువులను చేతితో పట్టుకునే విధానం, కస్టమర్లతో మాట్లాడే తీరు వంటి ప్రతి అంశాన్ని రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలకు (Humanoid Robots) శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్న మోషన్ క్యాప్చర్ పరికరాలు అయి ఉండొచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మనుషులు రోజువారీ పనులను ఎలా చేస్తారు? వస్తువులను ఎలా హ్యాండిల్ చేస్తారు? అనే డేటాను సేకరించి, రోబోలు కూడా అదే రీతిలో పనిచేసేలా శిక్షణ ఇచ్చేందుకే ఈ ప్రయోగం జరుగుతోందని చర్చించుకుంటున్నారు.

ఈ వైరల్ దృశ్యాలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో రోబోలే నేరుగా కూరగాయలు అమ్ముతాయా? అని సరదాగా ప్రశ్నిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం కార్మికుల నుంచి వారి నైపుణ్యాలకు సంబంధించిన డేటాను సేకరించి, భవిష్యత్తులో ఆ పనులన్నింటినీ రోబోలతో చేయిస్తే సామాన్య కార్మికుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైతేనేమి, టెక్నాలజీ పుణ్యమా అని బెంగళూరు మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇది కూడా చదవండి..: Delhi Showroom Murder | ఢిల్లీలో షాకింగ్ ఘటన.. షోరూమ్ ట్రయల్ రూమ్‌లో యువతి దారుణ హత్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *