అక్షరటుడే వెబ్‌డెస్క్: Jeevan Pramaan Certificate | పెన్షనర్లు తమ పింఛను ఎలాంటి అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా పొందడానికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ప్రతీ ఏటా నిర్వహించే వార్షిక ‘జీవన్ ప్రమాణ్’ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్) సమర్పణ ప్రక్రియ ప్రారంభమైంది. పింఛనుదారులు నవంబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య తమ జీవన ప్రమాణ పత్రాన్ని తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు మాత్రం అక్టోబర్ 1 నుంచే దీనిని సమర్పించే వెసులుబాటు కల్పించారు.
Jeevan Pramaan Certificate | ఇంటి నుంచే డిజిటల్ సర్టిఫికెట్..
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం కోసం పెన్షనర్లు నేరుగా తమ పింఛను జమ అయ్యే బ్యాంక్ శాఖకు వెళ్లవచ్చు. ఒకవేళ బ్యాంకుకు వెళ్లలేని వారు ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్లోనే ‘ఫేస్ అథెంటికేషన్’ (ముఖ ధ్రువీకరణ) సాంకేతికతను ఉపయోగించి ఇంటి నుంచే సులభంగా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
Jeevan Pramaan Certificate | వృద్ధుల కోసం డోర్‌స్టెప్ సేవలు..
సాంకేతిక పరిజ్ఞానం లేని వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్’ (IPPB), కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) అందిస్తున్న డోర్‌స్టెప్ సేవల ద్వారా ఇంటి వద్దనే ధ్రువీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఈ సేవలను కోరితే పోస్టల్ సిబ్బంది నేరుగా పెన్షనర్ ఇంటికే వచ్చి బయోమెట్రిక్ ( Biometric )లేదా ఫేస్ స్కాన్ ఆధారంగా సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
Jeevan Pramaan Certificate | పింఛను నిలిచిపోయే ప్రమాదం..
నవంబర్ 30 లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పక్షంలో డిసెంబర్ నెల నుంచి పెన్షన్ చెల్లింపులు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి పెన్షనర్లు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించి పింఛను సజావుగా పొందాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan Electric Shock | రోడ్డు పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు మృతి