అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rice Price Regulations | అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) స్పష్టం చేశారు. గజానన్ రైస్‌మిల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్ కమాన్ గోశాల రోడ్ వద్ద రైస్ అవుట్‌లెట్‌ను కలెక్టర్ ప్రారంభించారు.
Rice Price Regulations | నిర్దేశించిన ధరలకే విక్రయించాలి..
బీపీటీ, హెచ్ఎంటీ తదితర రకాల బియ్యంను ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మరికొంత తక్కువ ధరకే విక్రయాలు జరిపేలా ముందుకొచ్చిన గజానన్ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరంచాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని సూచించారు.
Rice Price Regulations | 26కిలోల బీపీటీ స్టీమ్ రైస్ బ్యాగ్..
కాగా 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బీపీటీ స్టీమ్ రైస్ బ్యాగ్‌ను రూ.1,510 లకు, హెచ్ఎంటీ రకం బియ్యం బస్తా రూ.2,030 చొప్పున అవుట్ లెట్ ద్వారా విక్రయాలు జరుపుతామని గజానన్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు హితెన్ భిమాని తెలిపారు. ఆధార్ కార్డును పరిశీలిస్తూ ఒక కుటుంబానికి నెలకు 26 కిలోలతో కూడిన ఒక బియ్యం బస్తా మాత్రమే విక్రయించేలా ఏర్పాట్లు చేశామని, దీనివల్ల ఏకమొత్తంలో కొనుగోళ్లకు ఆస్కారం లేకుండా అందరికీ నిర్ణీత ధరకు బియ్యం అందాలనే సదుద్దేశ్యంతో ఆధార్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమల్ కిషోర్, ప్రియాన్ భిమాని, రవీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Collectorate | కలెక్టరేట్లో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఇల్లు కబ్జా చేశారనే బాధతో అఘాయిత్యం..