Farmer Power Services | రైతులకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు: ట్రాన్స్​కో ఎస్​ఈ

Shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Farmer Power Services | రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే (electricity department) లక్ష్యంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(Northern Telangana Power Distribution Company) పనిచేస్తోందని నిజామాబాద్ సర్కిల్ ఎస్​ఈ పీవీ రాజేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో​ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.

Farmer Power Services | వాహనాలకు జీపీఎస్​ ట్రాకింగ్​..

ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో 2‌‌0 డిపార్ట్​మెంట్​ వాహనాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అందులో ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయబడిందన్నారు. తద్వారా ప్రతి వాహనం మూవ్​మెంట్​ను ఎప్పటికప్పుడు మానిటరింగ్​ చేస్తామని వివరించారు.ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో డిపార్ట్​మెంట్​ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలు అందుబాటులో ఉంటాయని.. ఎక్కడైనా ట్రాన్స్​ఫార్మర్​ కాలిపోయిందని సమాచారం అందగానే వెంటనే సదరు వాహనం అక్కడికి చేరుకుంటుందన్నారు. అలాగే వందశాతం మెరుగైన సేవలందిస్తుందని ఆయన వివరించారు.

Farmer Power Services | వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత..

వ్యవసాయ రంగానికి(agricultural sector) విద్యుత్ సరఫరా అత్యంత ప్రాధాన్యమని, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సేవలు అందించేందుకు ఈ ప్రత్యేక డిపార్ట్​మెంట్​ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ సమయంలో రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగకరమని వివరించారు. ఎలాంటి తక్షణపరమైన సమస్యలు తలెత్తిన వెంటనే 1912కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే తక్షణం స్పందించి తక్షణపరమైన విద్యుత్ సేవలు అందిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Telangana DSP Transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *