అక్షరటుడే, ఎల్లారెడ్డి: Urea Protest | రైతులకు యూరియా తిప్పలు తప్పట్లేదు.. నాగిరెడ్డిపేట్(Nagireddypet) మండలం ధర్మారెడ్డి గ్రామ రైతులు బుధవారం యూరియా కోసం జాతీయరహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
Urea Protest | చిన్న ఫోన్లతో ఎలా బుక్ చేయాలి..
యూరియా సరిగా అందకపోవడంతో (Fertilizer Shortage) ఆగ్రహించిన రైతులు గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులపై చిన్నచూపు చూస్తూ పంటలు పండించకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి. యూరియా ఎలా బుక్ చేయాలని ఆందోళన చెందుతున్నాం’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యాప్ తీసేసి రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.
Urea Protest | క్షణాల్లో అయిపోతోంది..
యూరియా వచ్చింది అని యాప్లు చూసేలోపే క్షణాల్లో అయిపోతోందని.. ఇదెలా సాధ్యమని రైతులు వాపోయారు. రైతులంతా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడరని, గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా అనేది రైతుకు ప్రాణాధారం లాంటిదని, యాప్ పద్ధతి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి రైతులను సముదాయించి యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని తెలపడంతో రాస్తారోకో విరమించారు.
