Wild Boar Accident | అడవి పంది అడ్డు రావడంతో.. కింద పడి ఒకరి మృతి

బైక్​కు అడవిపంది అడ్డురాగా అదుపుతప్పి కిందపడి లిఫ్ట్ ఇరిగేషన్​ ఆపరేటర్​ మృతి చెందాడు. ​

shashi kiran Mottala

అక్షరటుడే, డొంకేశ్వర్: Wild Boar Accident | బైక్​కు అడవి పంది అడ్డు రాగా అదుపు తప్పి కిందపడి లిఫ్ట్ ఇరిగేషన్ (Lift Irrigation Operator) పంప్​హౌస్​​ ఆపరేటర్​ మృతి చెందాడు. ​ఈ ఘటన మారంపల్లి లిఫ్ట్​ ఇరిగేషన్​ పంప్​హౌస్​ సమీపంలో చోటు చేసుకుంది.

Wild Boar Accident | మారంపల్లి లిఫ్ట్​ ఇరిగేషన్​ పంప్​హౌస్​ వద్ద..

ఎస్సై వినయ్​ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. డొంకేశ్వర్ ​(Donkeshwar) మండల పరిధిలోని గంగా సముందర్ అనే గ్రామానికి చెందిన సాకలి ఉస్సన్న (45) ఎనిమిది నెలలుగా మారంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ వద్ద ఆపరేటర్​గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే తన బైక్​పై పంప్​ హౌస్​కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం 4 గంటలకు డ్యూటీ అయిపోగానే తిరిగి ఇంటికి వస్తుండగా లిఫ్ట్ రోడ్డు గుట్ట ప్రాంతంలో ఎదురుగా అడవి పంది అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి మట్టి రోడ్డుపై కింద పడిపోయాడు.

ఈ ప్రమాదంలో ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుడు మైస సంతోష్ ఇచ్చిన సమాచారంతో మృతుడి మేనల్లుడు మేరా అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించాడు. అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్ 10 సీజన్ మొదలైంది.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *