Building Construction Excavation | నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు.. కూలిన ప్రహరీ.. భయాందోళనలో ప్రజలు

నగరంలో ఓ భారీ భవనం నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా అపశృతి చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Building Construction Excavation | నగరంలో (Nizamabad) ఓ భారీ భవనం నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా అపశృతి చోటు చేసుకుంది. తవ్వకాల్లో భాగంగా పక్కనే ఉన్న మరో భారీ భవంతి ప్రహరీ కూలిపోయింది. ఈ ఘటన నగరంలోని శ్రీనగర్​ కాలనీలో చోటు చేసుకుంది.

Building Construction Excavation | ఓ కార్పొరేట్​ ఆస్పత్రి భవన నిర్మాణం..

నగరంలో మున్సిపల్​ కార్పొరేషన్ (Municipal Corporation)​ పరిధిలోని శ్రీనగర్​ కాలనీలో ఓ కార్పొరేట్​ ఆస్పత్రి భారీ భవంతి నిర్మాణం జరుగుతోంది. అయితే మూడు సెల్లార్లు నిర్మించే క్రమంలో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న భవంతి ప్రహరీ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఆ భవనంలోని వారు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ప్రహరీ కూలిపోయి భవనం అంచుల వరకు మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా భవన యజమాని సత్యనారాయణ వెంటనే టౌన్​ప్లానింగ్ అధికారులకు, కలెక్టర్​, సీపీకి ఫిర్యాదు చేశారు. కమర్షియల్​ బిల్డింగ్​ నిర్మాణాన్ని కాలనీలో జనావాసాల మధ్య నిర్మించవద్దని సూచించినప్పటికీ నిర్మాణం కొనసాగిస్తున్నారని.. మున్సిపల్​ కార్పొరేషన్​ అనుమతులు సైతం ఎలా ఇచ్చిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. తక్షణమే నిర్మాణాన్ని నిలిపివేయాలని వారు కోరుతున్నారు.

build

ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేశుడి.. వీడియో చూశారా..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *