అక్షరటుడే, ఇందూరు : Mega Job Mela | నగరంలో(Nizamabad) ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
Mega Job Mela | శ్రీరామ గార్డెన్స్‌లో..
అర్బన్‌లోని యువతీయువకుల కోసం ఈనెల 9వ తేదీన ఆర్మూర్ రోడ్‌లోని శ్రీరామ గార్డెన్స్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, పారామెడికల్ డిప్లొమా, డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ, బీటెక్, ఫార్మసీ, పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన యువతీయువకులు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
రెండువేలకు పైగా ఉద్యోగాలు..
ఈ మెగా జాబ్‌మేళాకు సుమారు 60కి పైగా కంపెనీలు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆయా కంపెనీల్లో సుమారు 2వేలకు పైగా ఉద్యోగవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆసక్తిగల యవత 62811 59790, 93921 87672లలో సంప్రదించాలని సూచించారు. అప్లికేషన్ల రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.