Kamareddy POCSO Case | పోక్సో కేసులో నిందితుడికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy POCSO Case | చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 15 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా పడింది. కామారెడ్డి(Kamareddy) ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

Kamareddy POCSO Case | తాడ్వాయి పోలీస్​స్టేషన్​ పరిధిలో..

కేసు వివరాల్లోకి వెళ్తే.. 2022 జూన్ 12న తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తండ్రికి తన 9 ఏళ్ల కుమార్తె కడుపునొప్పితో బాధపడుతూ ఏడుస్తుండటం కనిపించింది. స్థానికంగా ఉండే గంగాధర్​ అనే వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాడ్వాయి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు విచారణలో బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని విచారించి నిందితుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను సేకరించి పోక్సో చట్టం కింద న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జిల్లా న్యాయమూర్తి ముక్తిదా నిందితుడిపై నేరారోపణలు రుజువైనట్లు నిర్ధారించి శిక్ష ఖరారు చేశారు.

ఇది కూడా చదవండి: షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *