అక్షరటుడే, వెబ్డెస్క్: TTD Specified Authority | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
టీటీడీ ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగిసిన నేపథ్యంలో.. కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు పరిపాలన నిమిత్తం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ‘స్పెసిఫైడ్ అథారిటీ’ (Specified Authority) కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నం. 658ని విడుదల చేసింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
TTD Specified Authority | కమిటీలో నియమితులైన అధికారులు వీరే..
- ముద్దాడ రవిచంద్ర, IAS (టీటీడీ ఈఓ) – ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
- వి. వినయ్ చంద్, IAS (ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి) – సభ్యుడిగా ఉంటారు.
- కె. కన్నబాబు, IAS (రెవెన్యూ – ఎండోమెంట్స్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి – ఎఫ్‌ఏసీ) – సభ్యుడిగా వ్యవహరిస్తారు.
TTD Specified Authority | ఎప్పటి వరకు అంటే..
సర్కారు ఉత్తర్వుల మేరకు సదరు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్వహించే అన్ని రకాల అధికారాలు, విధులను ఈ స్పెసిఫైడ్ అథారిటీ కమిటీ పూర్తిస్థాయిలో నిర్వహిస్తుంది.
ఈ కమిటీ పదవీకాలం ఒక సంవత్సరం పాటు లేదా కొత్త ట్రస్ట్ బోర్డు కొలువుదీరే వరకు (ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటివరకు) అమల్లో ఉంటుందని ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.