అక్షరటుడే, డిచ్పల్లి: Woman Murder Case | మహిళ హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ధర్పల్లి పోలీస్ స్టేషన్ (Dharpally Police) పరిధిలో జరిగిన ఘటన వివరాలను ఎస్సై సందీప్ తెలియజేశారు.
Woman Murder Case | ధర్పల్లి గ్రామంలో..
ధర్పల్లి గ్రామానికి చెందిన కోటగిరి గంగాధర్ 2025లో ఓ మహిళను హత్యచేసిన ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసి, న్యాయస్థానంలో తగిన ఆధారాలు, సాక్ష్యలను సమర్పించగా, విచారణ అనంతరం జిల్లాకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ నిందితుడు కోటగిరి గంగాధర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ భిక్షపతి , సహకరించిన పోలీస్ సిబ్బందిని గౌరవ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ నాయకులకు.. ప్రజల సమస్యలు పట్టవా..?