Vijay Deverakonda | విజయ్ దేవరకొండ వ్యాఖ్యలకు మద్దతు.. హిందూ సింహాల జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి : టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

హిందూ సింహాల జోలికొస్తే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Deverakonda | టాలీవుడ్​ నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడిన ప్రతి మాటను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ఆయనతో ఏకీభవిస్తున్నానని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

ఔరంగజేబు కాలంలో వందలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందూ ధర్మంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేయడం, హిందూ స్త్రీలను అవమానపరచడం వంటి రాక్షస ప్రవృత్తులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాశీ విశ్వనాథ ఆలయం, మధుర శ్రీకృష్ణ ఆలయం, సోమనాథ ఆలయంతో పాటు ఎన్నో ఆలయాల చరిత్ర కనుమరుగయ్యేలా వ్యవహరించారని పేర్కొన్నారు.

Vijay Deverakonda | ఖబడ్దార్​…

విజయ్ దేవరకొండ మాట్లాడిన తర్వాత కొందరు వ్యతిరేకంగా మాట్లాడటంపై స్పందిస్తూ… హిందూ సింహాల జోలికొస్తే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Vijay Deverakonda | సనాతన ధర్మ పరిరక్షణ

నేడు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ నడుము బిగించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ మహరాజ్, సంభాజీ మహరాజ్ స్ఫూర్తితో లక్షలాది మంది ముందుకు రావాలని హిందూ సోదరసోదరీమణులకు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *