అక్షరటుడే, బాన్సువాడ: Bathukamma Celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు బాన్సువాడ(Banswada) పట్టణంతో పాటు చందూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని 1000 డబుల్ బెడ్రూం కాలనీలో, చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ మోడల్ స్కూల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.
Bathukamma Celebrations | ప్రభుత్వ సలహాదారు పోచారం..
ఈ వేడుకల్లో వేడుకలకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మహిళలతో కలిసి నృత్యం చేస్తూ కోలాటలాడారు. బాన్సువాడ పట్టణంలోని వెయ్యి డబుల్ బెడ్రూం కాలనీలో ఏర్పాటు చేసిన 44 అడుగుల భారీ బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇది కూడా చదవండి: ఇండిగో విమానంలో మంటలు..అత్యవసర ల్యాండింగ్..