Nizamabad to Bengaluru Bus | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. నిజామాబాద్​ టు బెంగళూరు ట్రిప్​లో మరిన్ని సౌకర్యాలు

ఆర్టీసీ ప్రయాణికులకు నిజామాబాద్​ ఆర్టీసీ రీజియన్​ శుభవార్త చెప్పింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad to Bengaluru Bus | ఆర్టీసీ ప్రయాణికులకు నిజామాబాద్​ ఆర్టీసీ (Nizamabad RTC) రీజియన్​ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నిజామాబాద్-హైదరాబాద్ – బెంగళూరు లహరి ఏసీ సీటర్ & స్లీపర్ సర్వీస్​లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Nizamabad to Bengaluru Bus | కొత్త బోర్డింగ్​ పాయింట్లు

నిజామాబాద్​–బెంగళూరు లహరీ బస్​లో కొత్త బోర్డింగ్​ పాయింట్లను తీసుకొచ్చినట్లు ఆర్​ఎం ఎస్​వీజీ కృష్ణమూర్తి తెలిపారు. బెంగళూరు ప్రయాణికుల అభ్యర్థన మేరకు హైదరాబాద్​లో లహరి ఏసీ సీటర్ అండ్​ స్లీపర్ సర్వీస్​కు మేడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ‘ఎక్స్’ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా లహరి సర్వీసును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

Nizamabad to Bengaluru Bus | బెంగళూరు నుంచి నిజామాబాద్​ వచ్చేటప్పుడు..

Nizamabad to Bengaluru Bus

అదేవిధంగా.. బెంగళూరు నుండి నిజామాబాద్​కు వచ్చే (డౌన్) సర్వీస్​ సమయంలో పిణ్య, యశ్వంత్​పూర్​, ఆనంద్ రావు నగర్, ప్యాలెస్ గుట్టహళ్లి, సీబీఐ – జంక్షన్, బెంగళూరు – విమానాశ్రయం ‘X’ రోడ్ కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు ఆర్​ఎం వెల్లడించారు. ప్రయాణికులకు మరింత నాణ్యమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన సేవలను అందించడం టీజీఎస్ఆర్టీసీ లక్ష్యమని తెలిపారు. ఈ కొత్త బోర్డింగ్ పాయింట్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని లహరి ఏసీ సీటర్ అండ్​ స్లీపర్ సర్వీస్​లను ఆదరించాలని కోరారు. రిజర్వేషన్ కోసం సంస్థ వెబ్ సైట్ www.tgsrtcbus.in ద్వారా లేదా రిజర్వేషన్ కౌంటర్​లో టిక్కెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana University Courses | తెయూలో జాడలేని బీఫార్మసీ, బీపీఈడీ కోర్సులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
4 Comments