నిజామాబాద్Double Bedroom Houses | డబుల్​ బెడ్​రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

Double Bedroom Houses | డబుల్​ బెడ్​రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

ఇందూరులో నిర్మాణం పూర్తయిన డబుల్​ బెడ్​రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా కోరారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Double Bedroom Houses | ఇందూరులో నిర్మాణం పూర్తయిన డబుల్​ బెడ్​రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal) పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House), డబుల్ బెడ్ రూం ఇళ్లపై హైదరాబాద్​లోని (Hyderabad) హౌసింగ్ కార్పొరేషన్​లో (Housing Corporation) గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) సోమవారం ఉమ్మడి జిల్లా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ధన్​పాల్ సమీక్షలో పాల్గొని నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు.

Double Bedroom Houses | నాగారంతో పాటు కొత్త కలెక్టరేట్​ వద్ద..

ఈ సందర్భంగా ధన్​పాల్ మాట్లాడుతూ.. ప్రధానంగా నాగారంతో పాటు కొత్త కలెక్టరేట్ వద్ద ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గతంలో పలు వస్తువులు చోరీ అవడంతో.. ఇళ్లకు మరమ్మతులు చేసినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో మళ్లీ అదే దుస్థితి నెలకొందన్నారు. అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కేటాయించలేదని, అర్హులైన పేదలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు.

Double Bedroom Houses | 10వ తేదీలోపు డబుల్ బెడ్ రూం ఇళ్లు..

అర్బన్ నియోజకవర్గంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను మే10వ తేదీ లోపు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే నాగారంలోని బేస్​మెంట్​ లెవెల్​లో ఉన్న వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేసి అందజేస్తామని హామీ ఇచ్చారు. సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy | బీఆర్​ఎస్ శవంతో సమానం.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....