అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ganesh Immersion Preventive | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (Nizamabad Police) వినాయక నిమజ్జనం సందర్భంగా పలువురిని బైండోవర్ చేశారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) ప్రకటన విడుదల చేశారు.
Ganesh Immersion Preventive | జిల్లావ్యాప్తంగా 572 మంది బైండోవర్..
వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి, పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంబంధిత మండల తహశీల్దార్ల ఎదుట హాజరుపర్చి, చట్టపరమైన నిబంధనల ప్రకారం బైండోవర్ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి గొడవలు, ఘర్షణలు, అల్లర్లు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Ganesh Immersion Preventive | కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాదు డివిజన్ వ్యాప్తంగా 280 మంది బైండోవర్ చేయగా.. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా 175 మందిని, బోధన్ డివిజన్ వ్యాప్తంగా 117 మందిని బైండోవర్ చేశారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, సున్నితమైన ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆదాయానికి మించిన ఆస్తులు.. నిమ్స్ డాక్టర్ల గుట్టు రట్టు! ఏసీబీ సోదాలు.. మాజీ డైరెక్టర్ పై విజిలెన్స్ విచారణ!