అక్షరటుడే వెబ్‌డెస్క్: Chiranjeevi Blood Bank | మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌పై గతంలో వచ్చిన విమర్శలు, నిందలపై తీవ్రంగా స్పందించారు. ‘మెగా యూత్ ఫోర్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మెగా బ్లడ్ బ్యాంక్ ద్వారా తాము రక్తం అమ్ముకుంటున్నామంటూ కొందరు చేసిన తప్పుడు ప్రచారాన్ని చిరంజీవి తీవ్రంగా ఖండించారు. అందరి జీవితాలు ఒకేలా ఉండవని, కొంతమంది తమకు కుదరలేదనే అక్కసుతో నిరాధార ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. తాను సంపాదించే రెమ్యూనరేషన్‌తో పోలిస్తే ఎన్ని కోట్ల బ్లడ్ ప్యాకెట్లు అమ్మితే ఆ డబ్బు వస్తుంది? అని ప్రశ్నిస్తూ.. అలా మాట్లాడేవారి విజ్ఞత ఎంత చౌకబారుదో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో తాను వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు.
Chiranjeevi Blood Bank | అభిమానులతో మమేకం..
దేశవ్యాప్తంగా ఉన్న తమ అభిమానులను నేరుగా కలిసేందుకు త్వరలోనే ఒక సరికొత్త రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. సమాజ సేవలో నిరంతరం తలమునకలయ్యే అభిమానులే తన అసలైన బలం అని కొనియాడారు. కూతురు సుస్మిత సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. అభిమానులకు, తనకు మధ్య ఎలాంటి దూరం ఉండదని, వారి ఆశయాలకు అనుగుణంగానే మునుముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Chiranjeevi Blood Bank | రకరకాల చర్చలు ..
‘మెగా యూత్ ఫోర్స్’ను మరింత బలోపేతం చేయాలని చిరంజీవి పిలుపునివ్వడం, అభిమానుల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం ప్రస్తుతం సినీ , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొరుగు రాష్ట్రంలో సినీ రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో, చిరంజీవి భవిష్యత్ కార్యాచరణపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆయన తమ సభ్యుడేనని క్లెయిమ్ చేస్తుండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ తాజా వ్యాఖ్యలు కేవలం సేవా దృక్పథంతో చేసినవేనా లేక రాజకీయపరమైన వ్యూహమా అనేది కాలమే నిర్ణయించాలి.
బ్లడ్ అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి సాలిడ్ రిప్లై :
“నా రెమ్యునరేషన్ ముందు ఆ సంపాదన ఏపాటిది? అందుకే ఆ విమర్శలను అసలు పట్టించుకోను.#Chiranjeevi pic.twitter.com/s7j2HMVdT1
— Telugu360 (@Telugu360) September 22, 2026
ఇది కూడా చదవండి: GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో