అక్షరటుడే, డిచ్పల్లి: Telangana Activists Welfare Website | ఉద్యమకారుల సంక్షేమం కోసం, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం వెబ్సైట్ ఏర్పాటు చేయడం అభినందీనయమని ఉద్యమకారుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెయూ క్యాంపస్ ఆవరణలో సంబరాలు నిర్వహించారు.
Telangana Activists Welfare Website | పలువురికి పాలాభిషేకం..
ఉద్యమకారుల జేఏసీ నాయకులు పుప్పాల రవి, పస్క నర్సయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy), టీపీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్లపాటు ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు వెబ్సైట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Nandipet Durga Devi Festival | అద్భుతం.. రూ. 2.11 కోట్లతో అమ్మవారికి అలంకరణ..