అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Sircilla | సిరిసిల్ల గడుల మీద గురి పెడతామని, మర ఫిరంగులమై పేలుదామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. కేటీఆర్ (KTR)పై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయం అని అర్థం అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యం, దైవం కలిసిన ప్రాంతం సిరిసిల్ల అన్నారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి నిలబెట్టాడు.. ఆనాడు కేటీఆర్ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు సిరిసిల్లలో గెలిచారన్నారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.
Revanth Reddy Sircilla | జేబులు కట్ చేశారా
తాము చేసిన పనులకు సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. “పదేళ్లు రిబ్బన్ కట్ చేయకుండా.. మంది జేబులు కట్ చేశారా మరి? కరీంనగర్ బస్టాండ్‌లో జేబు దొంగల్లా తిరిగారా?”అని ప్రశ్నించారు. మానేరు ఇసుక దొంగ.. గోదావరి జలాలను అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రవీందర్, సంతోష్ రావు, కేటీఆర్ వేల కోట్లు దోచుకున్న మాట వాస్తవం కాదా అన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే.. ఆస్తులపై శ్వేతపత్రం అడగాలన్నారు.
కేటీఆర్ నీకు దమ్ముంటే.
నీ ఆస్తుల మీద..
నీ తండ్రి ఆస్తుల మీద..
సంతోష్ రావు ఆస్తుల మీద..
హరీష్ రావు ఆస్తుల మీద..
నీ బంధువుల ఆస్తుల మీద..
దమ్ముంటే స్వేత పత్రం అడుగు..:- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pic.twitter.com/WFnSbKGZrB
— Ravi Official 0009 (@TelanganaRavi09) September 30, 2026
దీనిని కూడా చదవండి : ACB Raid | ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్