అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Finance Representatives Attack | ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులపై దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని (Nizamabad) ఆరో టౌన్ ఎస్‌హెచ్‌వో సందీప్ వివరాలు వెల్లడించారు.
Finance Representatives Attack | ఆటోనగర్‌లో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆటోనగర్‌లో నివాసముండే షేక్ సబీ వదిన ఆర్బీఎల్ ఫైనాన్స్ కంపెనీ (RBL FINANCE COMPANY), సాటిన్ క్రెడిట్ కేర్ కంపెనీ లిమిటెడ్‌కు (SATIN CREDIT CARE. Ltd) డబ్బులు పెండింగ్‌లో ఉన్నారు.
ఈ క్రమంలో ఆయా కంపెనీల ప్రతినిధులు రాకేష్, రాజులు ఆమె ఇంటికి వెళ్లారు. డబ్బులు కట్టాలని ఆమెను అడుగుతుండగా.. నిందితుడు షేక్ సబీ, తండ్రి షేక్ సలీంలు వారిపై దాడికి పాల్పడ్డారు.
వీరిని హత్య చేస్తే డబ్బులు కట్టే అవసరం ఉండదని పేర్కొంటూ వారిరువురిపై సబీ, సలీంలు కత్తితో దాడి చేశారు. ఈక్రమంలో రాకేష్, రాజులకు తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో బాధితులు ఆరో టౌన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.
ఇది కూడా చదవండి: సింగరేణి బొగ్గు వదిలేసి..విదేశాల బొగ్గు ఎందుకు..?