Farmers Electricity Supply | రైతులకు నిరంతరంగా విద్యుత్​ సరఫరా చేయాలి

రైతులకు నిరంతరంగా విద్యుత్​ సరఫరా చేయాలని జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే డిమాండ్​ చేశారు. పెద్దకొడప్​గల్​లో తలపెట్టిన ధర్నాలో రైతులతో కలిసి పాల్గొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, పెద్దకొడప్​గల్​(పిట్లం): Farmers Electricity Supply | రైతులకు నిరంతరంగా విద్యుత్​ సరఫరా చేయాలని జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ షిండే డిమాండ్​ చేశారు. పిట్లం​ మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తలపెట్టిన ధర్నాలో రైతులతో కలిసి పాల్గొన్నారు.

Farmers Electricity Supply | వ్యవసాయానికి విద్యుతే కీలకం..

ఈ సందర్భంగా హన్మంత్‌ షిండే (Hanmant Shinde) మాట్లాడుతూ.. వ్యవసాయానికి విద్యుత్‌ ఎంతో కీలకమన్నారు. సరైన సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోతే రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సాగునీటి అవసరాలకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్‌ కోతలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా రైతుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్‌ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Land Scam | జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *