ACB Raids | అక్రమాస్తుల కేసు.. రెడ్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

టీజీ రెడ్​కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో టీజీ రెడ్​కో (TGREDCO) డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో 15 చోట్ల 8 బృందాలతో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున నుంచే ఈ తనిఖీలు చేపట్టారు.

ముత్యం వెంకటరమణ టీజీ రెడ్​కోలో డిప్యూటీ ఇంజినీర్​గా పని చేస్తున్నారు. ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఏసీబీ డీఎస్పీ (ACB DSP) మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. మాదాపూర్‌ (Madhapur)లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.

ACB Raids | కీలక పత్రాలు స్వాధీనం

సోదాల్లో కీలక ఆస్తి పత్రాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. డీఈ వెంకటరమణ విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాడులు ముగిశాక ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు. అయితే వెంకటరమణ 2019లో ఎస్​పీడీసీఎల్ (SPDCL)​ డీఈగా ఉన్న సమయంలో లంచం తీసుకుంటూ దొరికాడు. అప్పుడు కూడా ఆయన ఇంట్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. అవినీతి చేస్తూ దొరికిన అధికారిపై చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ పోస్టింగ్ భారీగా లంచాలు తీసుకున్నట్లు సమాచారం.

 

దీనిని కూడా చదవండి : California Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్​కు చెందిన ముగ్గురి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *