అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court holidays | తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు మే 7 నుంచి జూన్ 5 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో ఆ రోజుల్లో న్యాయస్థానం మూసి ఉంటుంది. ఈ మేరకు హైకోర్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
High Court holidays | వెకేషన్ బెంచ్
ప్రతి సంవత్సరం కోర్టులకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది మే 7 నుంచి జూన్ 5 వరకు హాలీడేస్ ఉండనున్నాయి. ఆ రోజుల్లో ఏదైనా అత్యవసర కేసులు విచారించాల్సి ఉంటే వెకేషన్ బెంచ్ (Vacation Bench) దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బెంచ్ మే 14, 21, 28, జూన్ 4 తేదీలలో విచారణ చేపడుతుంది. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఆయా తేదీలకు ముందు వచ్చే మంగళవారాల్లో స్వీకరిస్తారు. న్యాయస్థానానికి సెలవులు ఉన్నప్పటికీ, న్యాయం పొందే ప్రక్రియకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేశారు.
దీనిని కూడా చదవండి: ACB Case | ఇంటి పర్మిషన్ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

