Minority Students Education | మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం

మైనార్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minority Students Education | మైనార్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు ఆధునిక వసతులు కల్పించి, వారిని అన్ని రంగాల్లో పోటీతత్వానికి సిద్ధం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని బంగారుగూడలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల–కళాశాల (బాలుర) భవనాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నూతన భవనంలోని తరగతి గదులు, వసతి గదులు, భోజనశాల, ఇతర మౌలిక సదుపాయాలను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

Minority Students Education | విద్యా రంగానికి ప్రాధాన్యత

minority school

ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి తెలిపారు. ఇలాంటి విద్యాసంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

దీనిని కూడా చదవండి : Kishan Reddy Comments | హైదరాబాద్‌లో అక్రమ వలసదారుల దందా.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *