అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాష్ట్రానికో రంగు మారుస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా “చాత్రోంకీ గూంజ్” అంటూ విద్యార్థుల గురించి మాట్లాడుతున్న ఆయన.. ఒక్కసారి తెలంగాణకు వచ్చి విద్యార్థుల సమస్యలు వినాలని డిమాండ్ చేశారు. ఇక్కడి విద్యార్థుల గొంతు వింటేనే నిజమైన విద్యార్థుల గూంజ్ ఏంటో తెలుస్తుందన్నారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) పోరుబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన యువ సమరభేరిలో కేటీఆర్ మాట్లాడారు. తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని తీట మాటలు మాట్లాడుతున్నారని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అనే బట్టేబాజ్ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను నిండాముంచిన లఫంగా పార్టీ కాంగ్రెస్ అన్నారు.
KTR | కేసీఆర్తో పెట్టుకోవద్దు
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. ఆయనే కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. ఆయనతో పెట్టుకోవద్దని పేర్కొన్నారు. 2006లో కరీంనగర్లో కేసీఆర్ను రాజీనామా చేయమని సవాల్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ వీపు పగిలిందని, ఇప్పుడు మళ్లీ అదే అవుతదన్నారు. చేసిన మోసాలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు 420 హామీలకు 420 సార్లు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
KTR | ప్రభుత్వం బర్తరఫ్ అవుతుంది
ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని మాజీ మంత్రి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని పేర్కొన్నారు. దేశం వదిలించుకున్న కాంగ్రెస్ పార్టీ పొరపాటు వల్ల మన నెత్తిన కూర్చుందన్నారు. కాంగ్రెస్కు జాక్పాట్.. తెలంగాణకు గ్రహపాటు అయ్యిందని పేర్కొన్నారు.
అతడు సినిమాలో బ్రహ్మానందం నాలుగు రోజులు ఎక్సర్సైజ్ చేసి నాకు బాగా బలం వచ్చిందని చెప్పి మహేష్ బాబుని హిట్ మీ యార్, హిట్ మీ అని అంటాడు
మహేష్ బాబు గట్టిగా గుద్దితే బ్రహ్మానందం కిందికెళ్ళి పేస్ట్ కారుతుంది
కేసీఆర్తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గతి కూడా అదే అవుతుంది
– కేటీఆర్ pic.twitter.com/1Pnc2drq6Y
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
దీనిని కూడా చదవండి : Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ధర్నా