Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని ధర్నా

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని బీఆర్​ఎస్(BRS Bodhan)​ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు పట్టణంలో (Bodhan) ఆ పార్టీ ​ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Fee Reimbursement Dues | వెయ్యిరోజుల పాలనపై తీవ్ర వ్యతిరేకత

బోధన్ బీఆర్​ఎస్​ ఇన్​ఛార్జి అయేషా ఫాతిమా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులపై కక్ష సాధించే విధంగా ప్రవర్తిస్తోందన్నారు. విద్య శాఖ సీఎం వద్ద ఉన్నా కూడా విద్యార్థులకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు రావాల్సిన దాదాపు రూ.13,500 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదన్నారు. విద్యార్థులే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని.. అలాంటి విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేయడం సుమంజసం కాదని అయేషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kerala Car Accident | లారీని ఢీకొన్న కారు.. 8 మంది విద్యార్థుల మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *