Anganwadi Development | అంగన్​వాడీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి : స్రవంతిరెడ్డి

అంగన్​వాడీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు స్రవంతిరెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Anganwadi Development | అంగన్​వాడీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు స్రవంతిరెడ్డి అన్నారు. అంగన్​ మిలన్​ సేవా సంపర్క్​ కార్యక్రమంలో భాగంగా నగరంలోని అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

Anganwadi Development | 22వ డివిజన్​లో..

Anganwadi Development

నగరం (Nizamabad)లోని 22వ డివిజన్​లో అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించిన గోపిడి స్రవంతి రెడ్డి అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సౌకర్యాల వివరాలను టీచర్​ను అడిగి తెలుసుకున్నారు. అంగన్​ మిలన్​ సేవ ద్వారా అంగన్​వాడీల బలోపేతం, మహిళలు, చిన్నారుల పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అంగన్​వాడీ టీచర్​ను సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్​ కార్పొరేటర్​ వైష్ణవి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, ఉపాధ్యక్షురాలు శైలజ, కార్యదర్శి స్వరూప, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పురుషోత్తం, సుధ, సురేష్, రాజేశ్వర్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Hotel Food Safety | హోటళ్లలో భోజనం చేస్తున్నారా.. రోగాలు కొనితెచ్చుకున్నట్లే..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *