అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Bus Accident | బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. బస్సు కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కన చెట్టును ఢీకొంది. ఈ ఘటన అడ్లూర్ శివారులోని టీఎంఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
Kamareddy Bus Accident | కామారెడ్డి నుంచి మద్దికుంటకు..
స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి (Kamareddy) నుంచి మద్దికుంట గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టీఎంఆర్ ఫంక్షన్ హాలు సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చింది. దీంతో బస్సు అటూఇటూ కదలడం మొదలుపెట్టింది. దాంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బస్సు రోడ్డుపక్కన ఉన్న ఓ చెట్టును బలంగా ఢీకొంది. ప్రమాదంలో బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన ప్రయాణీకులను అంబులెన్సులో జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Temple Dispute | దళితులు వర్సెస్ వీడీసీ.. ఆలయ నిర్మాణంపై కొనసాగుతున్న సందిగ్ధత