Khilla Ramalayam Ropeway | ఖిల్లా రామాలయాన్ని సందర్శించిన​ అధికారులు.. రోప్​వే ఏర్పాటు కోసం సమాలోచనలు

నగరంలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడమైన ఖిల్లా రామాలయం అభివృద్ధికి అడుగులు పడ్డాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Khilla Ramalayam Ropeway | నగరంలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడమైన ఖిల్లా రామాలయం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ఆలయంలో రూ.180కోట్లతో రోప్​వే నిర్మించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారులు ఆలయాన్ని సందర్శించారు..

Khilla Ramalayam Ropeway | ఎమ్మెల్యే ధన్​పాల్ కృషితో..​

రాష్ట్రంలోనే చారిత్రక కట్టడమైన ఇందూరు ఖిల్లా రామాలయ అభివృద్ధికి అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) సూర్యనారాయణ అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్​ను కలిసి ఖిల్లా రామాలయ అభివృద్ధికి ‘పర్వతమాల పథకం’ను అమలు చేయాలని కోరారు. ప్రధానంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.180 కోట్లతో రోప్​వేతో పాటు అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి అడుగు వేశాయి.

Khilla Ramalayam Ropeway | సందర్శించిన అధికారులు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ఖిల్లా రామాలయాన్ని పరిశీలించారు. దేశంలోనే ప్రముఖ రోప్​వే కంపెనీ అయిన సీఆర్ఎస్ ప్రతినిధులు ఆలయ పరిసరాలను పూర్తిగా పరిశీలించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్​ను సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. మోనో కేబుల్, బై కేబుల్, జిగ్ జాగ్, ట్రై కేబుల్ ఉంటాయని, ఇక్కడి పరిసరాలకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు. ఆర్అండ్​బీ డీఈ మోహన్, రోప్​ వే కంపెనీ ప్రతినిధి తన్మయ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Anganwadi Development | అంగన్​వాడీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి.. స్రవంతిరెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *