అక్షరటుడే వెబ్‌డెస్క: May 04 Gold Rates | బంగారం Gold కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరటనిచ్చే పరిణామాలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు క్రమంగా పడిపోతుండగా, సోమవారం కూడా అదే ట్రెండ్ కొనసాగింది.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే రానున్న రోజుల్లో కూడా ధరలు మరింత తగ్గే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
May 04 Gold Rates | ప్రధాన నగరాల్లో
దేశంలోని ప్రధాన నగరాల్లో సోమవారం గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,920 వద్ద కొనసాగుతోంది. ఇది ఆదివారం ధరతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.
అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,340 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,720గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,990కు తగ్గింది.
బెంగళూరులో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,220గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,490 వద్ద కొనసాగుతోంది.
May 04 Gold Rates | వెండి ధర
ఇక వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కిలో వెండి ధర Silver Price రూ.2,64,900కు చేరగా, హైదరాబాద్‌లో రూ.2,69,900గా ఉంది. చెన్నైలో కూడా ఇదే స్థాయిలో ధరలు నమోదయ్యాయి. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద ట్రేడవుతోంది.
మొత్తంగా చూస్తే బంగారం, వెండి ధరలు తగ్గడం వల్ల పెళ్లిళ్లు, పండుగలు వంటి సందర్భాల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మారింది. అయితే అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం వంటి అంశాలు భవిష్యత్తులో ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Hyderabad SI transfers | ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

