అక్షరటుడే, వెబ్డెస్క్ : Electricity AE Bribery | అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ దాడులు (ACB Raids) చేపట్టి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నా.. ఏ మాత్రం భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ విద్యుత్ ఉద్యోగి రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సంతోష్ నగర్ సబ్ డివిజన్, మదన్నపేట సెక్షన్లో సంధ్య రాకేశ్ అసిస్టెంట్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి ఆన్లైన్ దరఖాస్తులను ఆమోదించడం ద్వారా పాత తప్పిపోయిన మీటర్ల స్థానంలో ఆరు కొత్త విద్యుత్ మీటర్లను మంజూరు చేస్తానని చెప్పి ఆయన రూ.1.20 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Electricity AE Bribery | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచించారు. ఎంత మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ (9440446106), వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Wrong UPI Transaction | రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారా? ఈ సింపుల్ ట్రిక్తో మీ డబ్బులు వెనక్కి తెచ్చుకోండి..