అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi Diwali Business Losses | పండగ సీజన్ వస్తోందంటే వ్యాపారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ, వరుస నిరసనలు, ఆందోళనల కారణంగా ఢిల్లీ వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగల సమయంలో రాజకీయ పార్టీలు నిరసనలకు పిలుపునిస్తుండటంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీపావళి పండుగ ముగిసే వరకు ఢిల్లీలో ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (CTI) కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ( Amit Shah )ప్రత్యేకంగా లేఖ రాసింది. పండగ రద్దీ సమయంలో ఆందోళనలు జరిగితే మార్కెట్లకు జనాలు రారనీ, దీనివల్ల వ్యాపారాలు భారీగా కుదేలవుతాయని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది.
Delhi Diwali Business Losses | వ్యాపారులపై ప్రభావం..
అక్టోబర్ 16న కన్నాట్‌ప్లేస్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడం వల్ల ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది వ్యాపారులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని CTI పేర్కొంది. కన్నాట్ ప్లేస్, జన్‌పథ్, ఖాన్ మార్కెట్ వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఆందోళనల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయి, రోడ్లు బ్లాక్ అయితే వినియోగదారులు షాపింగ్‌కు వచ్చేందుకు జంకుతారని తెలిపింది.
గతంలో అక్టోబర్ 10న జరిగిన నిరసనల వల్ల ఢిల్లీలోయూ లాక్డౌన్ వాతావరణం ఏర్పడిందని CTI గుర్తుచేసింది. ఆ ఒక్కరోజే మార్కెట్లకు కొనుగోలుదారులు రాకపోవడం వల్ల సుమారు రూ. 2,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. నవరాత్రులు, దీపావళి వంటి కీలకమైన వ్యాపార సీజన్లలో ఈ తరహా నిరసనలు ఇబ్బందికరంగా మారుతున్నాయని, కేంద్రం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Wrong UPI Transaction | రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారా? ఈ సింపుల్ ట్రిక్‌తో మీ డబ్బులు వెనక్కి తెచ్చుకోండి..