అక్షరటుడే వెబ్డెస్క్: Saraswati Devi Alankaram | శరన్నవరాత్రుల్లో అత్యంత పవిత్రమైన, విశేషమైన రోజు రానే వచ్చింది. అక్టోబర్ 16 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మూలానక్షత్రం పురస్కరించుకుని.. విజయవాడ ( Vijayawada )ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ భక్తులకు సాక్షాత్తూ ‘శ్రీ సరస్వతీ దేవి’ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. చదువుల తల్లిగా, జ్ఞానప్రదాతగా కొలిచే అమ్మవారి ఈ ప్రత్యేక అలంకార విశిష్టత, పూజా విధానం తెలుసుకుందాం.
Saraswati Devi Alankaram | మూలా నక్షత్ర విశిష్టత..
అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు తెల్లటి పట్టుచీర ధరించి, చేతిలో వీణ, అక్షమాల, పుస్తకం పట్టుకుని హంసవాహనంపై అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. సరస్వతీ దేవి అంటే జ్ఞానం, విద్య, సంగీతం, సాహిత్యం , వాక్కుకు అధిదేవత. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే ఈ అమ్మవారు, వ్యాస మహర్షి, వాల్మీకి, కాళిదాసు వంటి మహాకవులకు వాక్సుద్ధిని ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి. మూలా నక్షత్రం రోజు భారీ సంఖ్యలో విద్యార్థులు, భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
Saraswati Devi Alankaram | పూజా విధానం , నైవేద్యాలు..
మూలా నక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకు ఉండే రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ పర్వదినాన అమ్మవారికి తెల్లని వస్త్రాలు సమర్పించి, స్వచ్ఛమైన తెల్లని పూలతో పూజించాలి. నైవేద్యంగా ఈ రోజు అమ్మవారికి ప్రీతికరమైన ‘దద్ధ్యోజనం’ (పెరుగన్నం) సమర్పించడం ఆనవాయితీ. పూజా సమయంలో సరస్వతీ ద్వాదశనామ స్తోత్రాలు, ప్రత్యేక మంత్రాలు పఠించడం వల్ల విద్యలో అద్భుతమైన ప్రతిభ, జీవితంలో స్పష్టత, ఆత్మజ్ఞానం సిద్ధిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy Traffic Problems | ట్రాఫిక్తో టెన్షన్..టెన్షన్.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో